Biography
Lists
Also Viewed
Quick Facts
Intro | Indian film director |
Places | India |
is | Film director |
Work field | Film, TV, Stage & Radio |
Birth | Suryapet, Suryapeta Mandal, Suryapet district, India |
Biography
ఖాజా పాషా తెలంగాణ రాష్ట్రానికి చెందిన రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు, సినిమా దర్శకుడు. 2013లో వచ్చిన D/O వర్మ సినిమాకి దర్శకత్వం వహించి, తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టాడు. తెలంగాణ భాషలో తన పిహెచ్.డి. పరిశోధన గ్రంథాన్ని రాశాడు.
జననం
ఖాజా పాషా ఆగస్టు 7న డా. మన్సూర్ అలీ, డా. ఖుర్షీదాబేగం దంపతులకు తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాదు జిల్లా లోని సింగారం లో జన్మించాడు. ఖాజా పాషా తండ్రి మన్సూర్ అలీ ఆర్ఎంపీ డాక్టర్. చిన్నప్పటినుండి వివిధ రకాల పుస్తకాలు, నవలలు చదివిన ఖాజా పాషా సాహిత్యం, రచన వంటి వాటిల్లో ఆసక్తి పెంచుకున్నాడు.
విద్యాభ్యాసం
సూర్యాపేట లోని చైతన్య భారతి ఉన్నత పాఠశాలలో హైస్కూల్ విద్య, త్రివేణి జూనియర్ కళాశాలలో ఇంటర్మిడియట్ విద్య చదివాడు. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి బిసిఏ చదివాడు. అటుతరువాత సినిమాలపై ఉన్న ఆసక్తితో హైదరాబాద్ లోని తెలుగు విశ్వవిద్యాలయంలో రంగస్థల కళలశాఖలో చేరి, ఎం.ఏ. (2004-2006), ఎం.ఫిల్ (2009, గోల్డ్ మెడల్), పిహెచ్.డి. (2019) లో చదివాడు.
నాటకరంగ ప్రస్థానం
తెలుగు విశ్వవిద్యాలయం లో విద్యార్థిగా ఉన్న సమయంలో వివిధ నాటిక, నాటకాలల్లో నటించాడు. ఫరెవర్ ఫెంటాస్టిక్ థియేటర్స్ అనే నాటక సంస్థను స్థాపించాడు.
- నటించినవి: గోగ్రహణం, తుగ్లక్, పెద్దబాలశిక్ష, కుర్చీ, నథింగ్ బట్ ట్రూత్, గౌమత బుద్ధ, చీమకుట్టిన నాటకం, అభిజ్ఞాన శాకుంతలం, కాదుసుమా కల, కళ్ళు, కన్యాశల్కం, అభిజ్ఞాన శాకుంతలం, 7+1, బ్రహ్మరాత, రాణిరుద్రమ, యమా అమ్ సారీ,
- రాసినవి: శాపగ్రస్తులు, కృష్ణ సాగరి, గాయత్రి ఢాటరాఫ్ బషీర్ అహ్మద్, చింత బరిగె స్కీం
- దర్శకత్వం వహించినవి: శాపగ్రస్తులు
అవార్డులు
నంది నాటక పరిషత్తు అవార్డులు
- శాపగ్రస్తులు నాటకం:- 2006 నంది నాటకోత్సవంలో ఖాజా పాషా రచించి, దర్శకత్వం వహించిన శాపగ్రస్తులు నాటకానికి ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ రచయిత, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ప్రతి నాయకుడు (మల్లేశ్ బలష్టు), ఉత్తమ దుస్తులు ఆహార్యం (నిరుపమ సునేత్రి, సురభి చంటి) విభాగాలలో నంది బహుమతులు లభించాయి.
- గాయత్రి ఢాటరాఫ్ బషీర్ అహ్మద్ నాటిక:- 2009 నంది నాటకోత్సవంలో ఖాజా పాషా రచన, పోచంబావి గోపికృష్ణ దర్శకత్వం వహించిన గాయత్రి ఢాటరాఫ్ బషీర్ అహ్మద్ నాటిక ద్వితీయ ఉత్తమ ప్రదర్శన, ద్వితీయ ఉత్తమ రచయిత, ఉత్తమ బాలనటి కోట్ల తన్మయి, ఉత్తమ సంగీతం (సురభి శ్రీనాథ్) విభాగాలలో నంది బహుమతులు లభించాయి.
పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు అవార్డులు
- శాపగ్రస్తులు నాటకం:- 2007 పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తులో ఖాజా పాషా రచించి, దర్శకత్వం వహించిన శాపగ్రస్తులు నాటకానికి ద్వితీయ ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ రచయిత, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ప్రతి నాయకుడు (మల్లేశ్ బలష్టు), ఉత్తమ నటుడు (లక్ష్మీ కిరణ్) విభాగాలలో బహుమతులు లభించాయి.
- గాయత్రి ఢాటరాఫ్ బషీర్ అహ్మద్ నాటిక:- 2010 నంది నాటకోత్సవంలో ఖాజా పాషా రచన, పోచంబావి గోపికృష్ణ దర్శకత్వం వహించిన గాయత్రి ఢాటరాఫ్ బషీర్ అహ్మద్ నాటికకు వివిధ విభాగాలలో బహుమతులు లభించాయి.
బోప్పన్న అవార్డు
యండమూరి వీరేంద్రనాథ్ నాటకలు: రంగస్థల ప్రయోగం - ఒక పరిశీలన అనే ఎం.ఫిల్ సిద్ధాంత గ్రంథానికి 2009లో తెలుగు విశ్వవిద్యాలయం చే బోప్పన్న అవార్డు (గోల్డ్ మెడల్) అందుకోవడం జరిగింది.
జె.ఎల్. నరసింహారావు స్మారక యువ పురస్కారం
తెలుగు విశ్వవిద్యాలయంలోని రంగస్థల కళలశాఖ ప్రతి ఏట ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు నాటకరంగంలోని యువ కళాకారులకు ఇచ్చే జె.ఎల్. నరసింహారావు స్మారక యువ పురస్కారంలో భాగంగా 2012 సంవత్సరానికి ఖాజా పాషాకు ఇవ్వడం జరిగింది.
సినీరంగ ప్రస్థానం
- D/O వర్మ సినిమాకు రచన, దర్శకత్వం, నిర్మాత.
- కాళీచరణ్ సినిమాకు సహా రచయితగా చేసాడు.
- బతుకమ్మ సినిమా దర్శకుడు ప్రభాకర్ దర్శకత్వంలో వచ్చిన ఒక కాలేజి స్టొరీ అనే సినిమాకి సంభాషణలు రాసాడు.
- సారాయి వీర్రాజు సినిమాకు కాస్టింగ్, అసోసియేట్ డైరెక్టర్ గా చేసాడు. అ చిత్రంలో నటించాడు.
- అపార్ట్ మెంట్ అనే సినిమాకు చీఫ్ కో-డైరెక్టర్ గా చేసాడు.
- కృష్ణవంశీ, పైసా సినిమాకు, సురేందర్ రెడ్డి, ఊసరవెల్లి సినిమాలకు స్క్రిప్ట్ వర్క్ లో పాల్గొన్నాడు.
- ఎన్.శంకర్ దగ్గర స్టోరి డిపార్టుమెంట్ లో, పరుచూరి గోపాలకృష్ణ దగ్గర స్క్రీన్ ప్లేలో పాల్గొన్నాడు.
- రాజరథం అనే కన్నడ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్, అసోసియేట్ రైటర్ గా పనిచేశాడు.
ఫిల్మ్‌మేకింగ్‌పై ఆన్‌లైన్ శిక్షణ
సినిమారంగంలోకి వెళ్ళాలనుకునే ఔత్సాహికులను ప్రోత్సహించి వారికి 24 క్రాఫ్ట్స్‌పై అవగాహన కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, ఫర్ ఎవర్ ఫెంటాస్టిక్ థియేటర్స్ సంస్థల తరపున ఖాజా పాషా ఆధ్వర్యంలో ఫిల్మ్ మేకింగ్‌పై ఆన్‌లైన్ విధానంలో ఇస్తున్న శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. సినిమారంగంలో వివిధ శాఖలలో అనుభవమున్న నిపుణులు ఈ శిక్షణా కార్యక్రమానికి వచ్చి ఫిల్మ్ మేకింగ్‌లోని 24 క్రాఫ్ట్స్‌కు సంబంధించిన వాటిపై యువ కళాకారులను శిక్షణ ఇస్తున్నారు.