Karur N. Chinnasami Iyer
Violinist and Music Composer
కె.ఎన్.చిన్నస్వామి అయ్యర్ ఒక వాయులీన విద్వాంసుడు.
ఇతడు 1888లో ఒక కర్ణాటక సంగీత విద్వాంసుల కుటుంబంలో నరస అయ్యర్, అఖిలాండామ్మాళ్ దంపతులకు జన్మించాడు. ఇతడు వయోలిన్ వాదనను మొదట తన తండ్రి వద్ద, తరువాత తన సోదరుడు దేవుడు అయ్యర్ వద్ద నేర్చుకున్నాడు. ఇతడు సోలో ప్రదర్శనలతో పాటు అగ్రశ్రేణి సంగీత విద్వాంసుల కచేరీలకు ప్రక్క వాద్యం అందించాడు. ఇతడు భారతదేశంలోని అన్ని ముఖ్యపట్టణాలలో, మలయా, సిలోన్, బర్మా దేశాలలో తన కచేరీలను ఇచ్చాడు. 1904లో మైసూరు మహారాజు ఇతడిని సన్మానించాడు. 1950లో మద్రాసు సంగీత అకాడమీ ఇతనికి సంగీత కళానిధి పురస్కారాన్ని ప్రదానం చేసింది. 1964లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ఇతడికి సంగీత నాటక అకాడమీ అవార్డును ప్రకటించింది.