Biography
Filmography (14)
Lists
Also Viewed
Quick Facts
Biography
జయశ్రీ రాచకొండ న్యాయవాది, సినిమా నటి. ఎక్స్‌టెండెడ్ వారంటీ అనే షార్ట్ ఫిలింలో నటించిన జయశ్రీ, సీతా ఆన్ ది రోడ్ , అ!, మల్లేశం, బుర్రకథ, వాళ్ళిద్దరి మధ్య వంటి చిత్రాలలో నటించింది.
జననం - విద్యాభ్యాసం
జయశ్రీ, అక్టోబరు 12న తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ లో రాచకొండ నర్సింగరావ్, విజయలక్ష్మి దంపతులకు జన్మించింది. తండ్రి అకౌంట్స్ ఆఫీసర్‌గా ఎఫ్‌సిఐ, రామగుండంలో పనిచేశాడు, తల్లి గృహిణి. పదవతరగతి వరకు రామగుండంలోని ఎఫ్‌సీఐ స్కూల్‌లో చదువుకుంది. ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరంలో ఉండగానే పంచాయితీరాజ్ ఇంజనీర్ తో వివాహం అయ్యింది. వీరికి ఒక కుమార్తె . కూతురు పుట్టిన తర్వాత భర్త ప్రోత్సాహంతో ఓపెన్ యూనివర్సిటీలో బీఏ చేసి, తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్‌బి, ఎల్‌ఎల్‌ఎమ్, పిజిడిఐపిఆర్ చేసింది. ప్రస్తుతం హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తోంది. భర్త పంచాయతీరాజ్ శాఖలో ఈఈగా పనిచేస్తున్నాడు.
సినిమారంగం
2018లో ఎఫ్‌సీఏ స్కూల్ రీయూనియన్ కార్యక్రమంలో జయశ్రీ హావభావాలు గమనించిన తన సహచర విద్యార్థి ప్రణీత్ సీతా ఆన్ ది రోడ్ అనే ఫీచర్ ఫిల్మ్‌లో అవకాశం ఇచ్చాడు. అదిచూసి నాని నిర్మాతగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన అ! సినిమాలో అవకాశం వచ్చింది. ఆ తరువాత మాయం సినిమాలో మల్లేశం సినిమాలో డాక్టర్‌గా, వాళ్ళిద్దరి మధ్య సినిమాలో హీరోయిన్ తల్లిగా నటించింది.
నటించినవి
చిన్నసినిమాలు
- ఎక్స్‌టెండెడ్ వారంటీ
సినిమాలు
- సీత ఆన్ ది రోడ్
- అ! (దేవి)
- మాయం
- మల్లేశం (డాక్టర్)
- బుర్రకథ (2019) (హీరోయిన్ తల్లి)
- వాళ్ళిద్దరి మధ్య (సుజాత, హీరోయిన్ తల్లి)
- విఠల్ వాడి (హీరో తల్లి)
వెబ్ సిరీస్
- చదరంగం (జీ–5, ప్రధానమంత్రి)
- ఎక్స్‌పైరీ డేట్ (జీ-5, హీరో తల్లి)