Chinta Prabhakar

Politician from Telangana
The basics

Quick Facts

IntroPolitician from Telangana
isPolitician
The details

Biography

చింతా ప్రభాకర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు మరియు మాజీ ఎమ్మెల్యే. చింతా ప్రభాకర్ 26 జనవరి 2022న టిఆర్ఎస్ పార్టీ, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.

జననం, విద్యాభాస్యం

చింతా ప్రభాకర్ 1959 ఆగస్టు 10న తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా , సదాశివపేట లో జన్మించాడు. ఆయన సదాశివపేట లోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

చింతా ప్రభాకర్ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన సదాశివపేట మున్సిపాలిటీ మాజీ ఛైర్మన్‌గా పని చేశాడు. చింతా ప్రభాకర్ 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తూర్పు జయప్రకాశ్ రెడ్డి చేతిలో 6772 ఓట్ల తేడాతో ఓటమి పాల్యయాడు. ఆయన 2011లో టిఆర్ఎస్ లో చేరి సంగారెడ్డి టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి గా నియమితుడయ్యాడు.

చింతా ప్రభాకర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తూర్పు జయప్రకాశ్ రెడ్డి పై 29,814 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తూర్పు జయప్రకాశ్ రెడ్డి చేతిలో 2589 ఓట్ల తేడాతో ఓటమి పాల్యయాడు.

చింత ప్రభాకర్ 2022 సెప్టెంబర్ 12న తెలంగాణ రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా నియమితుడై 2022 సెప్టెంబర్ 27న బాధ్యతలు స్వీకరించాడు.ఆయన 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి, డిసెంబర్ 05న తెలంగాణ రాష్ట్ర హ్యాండ్లూమ్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశాడు.

మూలాలు

The contents of this page are sourced from Wikipedia article on 10 Dec 2023. The contents are available under the CC BY-SA 4.0 license.