Biography
Lists
Also Viewed
Quick Facts
Intro | Telugu Film Director and Writer |
is | Film director Writer |
Work field | Film, TV, Stage & Radio |
Biography
చిమ్మని మనోహర్, తెలుగు సినిమా దర్శకుడు, రచయిత. ఆయన ‘కల’, అలా, వెల్‌కమ్, స్విమ్మింగ్ ఫూల్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు.
జీవిత విశేషాలు
మనోహర్ నవంబరు 26న వరంగల్ పట్టణంలో జన్మించాడు. ప్రస్తుతం హైదరాబాదులో నివసిస్తున్నాడు. మెషినిస్టుగా ఫాక్టరీల్లో పనిచేసిన కొంతకాలం తర్వాత మళ్ళీ చదువు వైపు దృష్టి మళ్ళించాడు. తెలుగు సాహిత్యం, లైబ్రరీ & ఇన్‌ఫర్మేషన్ సైన్సుల్లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు చదివాడు. విశ్వవిద్యాలయ టాపర్‌గా పీజీ, పోస్టుగ్రాడ్యుయేషన్ లో రెండు గోల్డ్ మెడల్స్ కూడా పొందాడు. తరువాత మూడు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేశాడు. ఆయన ఆఖరి ఉద్యోగం - ఆలిండియా రేడియోలో సుమారు 11 ఏళ్లు పనిచేశాక, ఆ ఉద్యోగానికి రిజైన్ చేశాడు. ప్రస్తుతం "ఇన్‌ఫొప్రెన్యూర్" (ఇన్‌ఫర్మేషన్ మార్కెటింగ్ ఆన్‌లైన్) పనిని స్వంతంగా పూర్తిస్థాయిలో చేస్తున్నారు.
రచయితగా
ఆయనకు చిన్నప్పటినుంచీ చదవటం, రాయటం అలవాటు. ఆయన విద్యార్థిగా ఉన్నప్పట్నుంచే కథానికలు, వ్యాసాలు, ఫీచర్లు మొదలైనవి ఎన్నో దాదాపు అన్ని తెలుగు న్యూస్‌పేపర్లు, మేగజైన్లలో ప్రచురితమయ్యాయి. ఎక్కువగా ఆయన రాసిన కథానికలు "ఆంధ్ర భూమి" వీక్లీలో అచ్చయ్యాయి. ఆయన రష్యన్ నుంచి నేరుగా తెలుగులోకి ఒక ఇరవై వరకు కథల్ని అనువదించాడు. వాటిలో ఎక్కువభాగం కథలు "విపుల", "ఆంధ్ర జ్యోతి" పత్రికల్లో అచ్చయ్యాయి.
కేసీఆర్.. ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్
కేసీఆర్ కేంద్రబిందువుగా తెలంగాణ ఉద్యమంలోని వివిధ అంశాలపై, ఉద్యమానంతర విషయాలపై ఆయా సందర్భాల్లో తన ఆలోచనలను తన బ్లాగ్‌లో, పత్రికల ఎడిట్ పేజీల్లో పలు వ్యాసాలు రాశాడు. ఆయా వీటన్నింటినుంచి ఎంపికచేసిన కొన్ని వ్యాసాలతో ‘కేసీఆర్-ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్’ అనే పుస్తకాన్ని ప్రచురించాడు. ఈ పుస్తకాన్ని 2022 జూలై 5న ప్రగతిభవన్‌లో తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆవిష్కరించాడు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర మహిళాశిశు సంక్షేమ శాఖామంత్రి సత్యవతి రాథోడ్, చేవెళ్ళ ఎంపీ జి.రంజిత్ రెడ్డి, స్వర్ణసుధ పబ్లికేషన్స్ అధినేత పరమేశ్వర్ రెడ్డి బైరి, తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
దర్శకుడిగా
2004లో రాజా హీరోగా వచ్చిన కల సినిమాతో దర్శకుడిగా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించాడు. ఆ తరువాత అలా, వెల్‌కమ్, స్విమ్మింగ్ ఫూల్ సినిమాలకు దర్శకత్వం వహించాడు.
అవార్డులు
మనోహర్ రాసిన సినిమా స్క్రిప్టు రచనాశిల్పం పుస్తకానికి 1998లో నంది ఉత్తమ పుస్తక పురస్కారం లభించింది.
మూలాలు
ఇతర లింకులు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో చిమ్మని మనోహర్ పేజీ