Biography
Lists
Also Viewed
Quick Facts
Intro | Telugu writer. | |
A.K.A. | Chayaraju Konkyana Chayaraj Chayaraj K K. Chayaraj | |
A.K.A. | Chayaraju Konkyana Chayaraj Chayaraj K K. Chayaraj | |
Places | India | |
was | Writer | |
Work field | Literature | |
Gender |
| |
Birth | 6 July 1948, Gaara mandal, India | |
Death | 20 September 2013 (aged 65 years) | |
Star sign | Cancer |
Biography
ఛాయరాజ్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రముఖ కవి మరియు రచయిత. ఈయన "జనసాహితి" రాష్ట్ర అధ్యక్షుడుగా పనిచేశారు.
జీవిత విశేషాలు
శ్రీకాకుళం జిల్లా లోని గార మండలం కొంక్యానపేటలో 1948 జూలై 6లో కొంక్యాన సూరమ్మ, సూర్యనారాయణ దంపతులకు ఛాయరాజ్ జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం ఊళ్లోనే సాగింది. బిఎస్సీ బిఇడి చేసిన ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేశారు. సామాజికశాస్త్రంలో ఎం.ఎ. చదివారు. ఈయన జీవ శాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేశారు. 2005లో గజిటెడ్ ప్రధానోపాధ్యాయునిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, దూసిపేట లో ఉద్యోగ విరమణ పొందారు. మొదటి నుండి సాహిత్య కృషి సాగించారు. శ్రీకాకుళం గిరిజన రైతాంగ సాయుధ పోరాటాన్ని కావ్యరూపంగా మలిచారు. కొండకావ్యం 'గుమ్మ', స్త్రీ, పురుష సంబంధాలను విప్లవీకరించిన 'నిరీక్షణ', బుదడు, తొలెరుక, మన్ను నన్ను మౌనంగా ఉండనీయదు, మాతృభాష, దర్శిని, రసస్పర్శ, దుఖ్ఖేరు తదితర కథలు, కావ్య రచనలు చేశారు. ఆయన రచనలు శ్రీకాకుళం, కారువాకిని ఇటీవలే ఆవిష్కరించారు. 1980లో జనసాహితీలో సభ్యునిగా చేరిన ఛాయరాజ్ 2007 నుండి ఇప్పటివరకూ ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నారు. ఫ్రీవర్స్ ఫ్రంట్, తెలుగు వెలుగు, ఆంధ్రప్రదేశ్ సాహితీ సాంస్కృతిక సమాఖ్య, జిల్లా సాంస్కృతిక మండలి అవార్డులు అందుకున్నారు.
శిల్పగతమైన శక్తులు ఎన్నివున్నా, కవికి వ్యక్తిత్వాన్ని ఇచ్చేవి అతని విశ్వాసాలు, అభిప్రాయాలే. సమాజం గురించి, జీవితం గురించి స్థిరమైన అభిప్రాయాలు లేనివాడు ఎన్నాళ్లయినా తనదని చెప్పుకోదగ్గ వ్యక్తిత్వం పొందలేడు. ఈ నిర్దిష్టమైన విలువలు తన ప్రతి రచనలోనూ మేళవించి సామాజిక ప్రయోజనం పరమావధిగా రచనలు చేస్తున్న అతి కొద్దిమంది తెలుగు కవులలో ఛాయరాజ్ ఒకరు. శ్రీకాకుళం పట్టణానికి చెందిన కవి ఛాయరాజుకు 2005లో ప్రతిష్ఠాత్మక ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు లభించింది.తెలుగు కవిత్వంలో ఫ్రీవర్స్ ఫ్రంటుకు ఉత్తమ బహుమానం అన్న విలువ ఉంది.
ఛాయరాజ్ రచించిన నవల 'కారువాకి'.. ఆయన మరణానికి కేవలం రెండు రోజుల ముందు.. 19.09.13న ఆవిష్కృతమైంది. అలాగే.. 1959-70 నడుమ సాగిన శ్రీకాకుళ గిరిజనోద్యమాన్ని 'శ్రీకాకుళం' కథాకావ్యంగా ఆయన ఆవిష్కరించారు. ఉపాధ్యాయుడుగా పనిచేసిన ఆయన.. ఎందరో విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దారు.
ఈయన శ్రీకాకుళం పట్టణంలో గుజరాతీపేటలో నివాసమున్నారు. నాలుగు దశాబ్దాలుగా తెలుగు సాహితీ రంగానికి ఆయన సేవ చేసిన ఆయన సెప్టెంబరు 20,2013 న మరణించారు.
రచనలు
ముద్రిత రచనలు
లేని నన్ను గురించిన ఆలోచన నీకెందుకు నీ జ్ఞాపకంలో నా ఆశయాన్ని కొనసాగించేటందుకు కానరాని నాకోసం నేనెందుకు లేనో లేని నువ్వు నా కోసం ఇద్దరమూ లేనినాడు
|
- శ్రీకాకుళం (ఉద్యమ కథా కావ్యం)(1989): శ్రీకాకుళం ఉద్యమం ప్రభావంతోనే ఛాయరాజ్ ‘శ్రీకాకుళ కావ్యం’ రాసారు.
- గుమ్మ (కొండ కావ్యం) - ఫిబ్రవరి 1995
- దర్శిని (కావ్యం) - ఫిబ్రవరి 1995
- నిరీక్షణ (కావ్యం) - డిసెంబరు 1996
- బుదడు (స్మృతి కావ్యం) - జూన్ 2003
- తొలెరుక (జన్మకావ్యం) - జనవరి 2005
- దుఖ్కేరు (స్మృతి కావ్యం) - జనవరి 2005
- రస స్పర్శ (కవిత) - జూలై 2005
- ది లాంగింగ్ ఐ ( ఎ లాంగ్ పోయం) ఆగస్టు 1999
(తెలుగు "నిరీక్షణ్"కు ఆర్.ఎస్ & ఎస్.ఎన్.మూర్తి) అనువాదం - మట్టి నన్ను మవునంగా ఉండానీదు (కవితా సంపుటి) ఆగష్టు 1999
- కారువాకి (చారిత్రక కళింగయుద్ధ నవల) సెప్టెంబర్ 2013
- వివిధ పత్రికలలో ప్రచురింపబడ్డ సుమారు 300 కవితలు.
- సాహిత్య, సామాజిక అంశాలపై వ్రాసిన వ్యాసాలు (ముద్రితమైనవి)
- కథలు: "అనుపమాన" కథారూపకాల పుస్తకం - మార్చి 2010
- సెల్‌ఫోన్ కథలు : సుమారు 6 కథలు "ప్రజాసాహితి" పత్రికలో 2009-10 సం.లలో ప్రచురితం.
- అనుపమాన కథారూపకాలు
- కుంతి
అముద్రిత రచనలు
- దుగ్గేరు (నృత్య గీతాలు)
- అమరకోశం (కావ్యం)
- చారిత్రక నాటిక
అసంపూర్ణ రచనలు
- గున్నమ్మ (దీర్ఘ కవిత)
- టి.ఎన్.కావ్యం ( దీర్ఘ కవిత)
అవార్డులు
- ఫ్రీవెర్స్ ఫ్రంట్ అవార్డు (2000 సంవత్సరం)
- తెలుగు వికాసం అవార్డు (2006)
- లాంగుల్యా మిత్రుల పురస్కారం (2005) బంగారు పతకం.
- డా. ఆవంత్స సోమసుందర్ సత్కారం, పిఠాపురం, 2004, నవంబరు 18
- సొ.ను. లిటరరీ ట్రష్టు - కృష్ణశాస్త్రి కావ్య పురస్కారం - నవంబరు 2010
మూలాలు
యితర లింకులు
- ప్రజా సాంస్కృతికోద్యమంలో చెరగని 'ఛాయ' - బెందాళం కృష్ణారావు