Chatti Poornayya Pantulu

The basics

Quick Facts

PlacesIndia
Gender
Male
Birth1885
The details

Biography

చిట్టి చిన పూర్ణయ్య పంతులు (1885 - 1935) ప్రఖ్యాత రంగస్థల నటులు.

వీరు 1885 సంవత్సరం శ్రీకూర్మం క్షేత్రంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు వెంకటనర్సులు మరియు వెంకట నరసమ్మ. వీరు 1901లో మెట్రిక్యులేషన్ లో ఉత్తీర్ణులై 1911 సంవత్సరంలో పట్టభద్రులయ్యారు. వీరు 1912లో ప్లీడరు పరీక్షలో ఉత్తీర్ణులై వృత్తిని ప్రారంభిచారు. శ్రీకాకుళంలో 1905లో "హామ్లెట్" నాటకంలో హోరేషియా భూమికను పోషించడం ద్వారా నాటకరంగంలో ప్రవేశించారు. 1907లో రమా విలాసినీ సమాజంలో చేరి గయోపాఖ్యానంలో బలరాముడు, పాండవోద్యోగ విజయాలలో కర్ణుడు మొదలైన పాత్రలను ధరించారు. 1911లో మద్రాసులో చిత్రనళీయం నాటకంలో బహూక పాత్రపోషించి ధర్మవరం రామకృష్ణమాచార్యుల వారిని మెప్పించారు.

1914 సంవత్సరంలో శ్రీకాకుళం పురపాలక సంఘానికి కౌన్సిలర్ గా ఎన్నికై 1921లో అధ్యక్షులయ్యారు. ఆ తర్వాత వరుసగా నాల్గు సార్లు అధ్యక్షులుగా ఎన్నికకావడం అపూర్వం. వీరు 1928లో దేవిడీ జమిందారు గారి ఆదరణతో రమా విలాస అమెచ్యూర్ల్ అనే నాటక సమాజాన్ని ప్రారంభించారు. వీరి తొలి నాటక ప్రదర్శనం ద్రౌపదీ వస్త్రాపహరణంలో దుర్యోధన పాత్రను పోషించారు. 1925లో రోషనారలో శివాజీగా నటించారు. వీరు శివాజీ వేషం చాలా ప్రసిద్ధి పొందినది. నాటి జిల్లా కలెక్టరు గారైన గిల్లెట్ వీరిన్ శివాజీ మహారాజ్ అని సంబోధించేవారు. వీరు గద్యానికి ప్రాముఖ్యం ఇచ్చి 1921 నుండి పద్యాలు పాడడం మానేశారు. పద్యాలున్న చోట వాటి భావం గద్యంలోనే చెప్పేవరు.

ఆంధ్ర నాటక కళాపరిషత్తు వ్యవస్థాపక సభ్యులు, 1929

1928లో యూనివర్సిటీ - ఆరనికీ డి ఫ్రాన్స్ లో భారతీయ నాటక శాస్త్రంలో గౌరవాచార్యులుగా బిరుదుపొందారు. 1929లో తెలుగు నాటకరంగ నిర్వాహకులు, కళాకారులు, కవులు, పోషకులలోని ముఖ్యులు కలిసి నాటకరంగ పునరుద్ధరణకు పెట్టిన ఆంధ్ర నాటక కళాపరిషత్తులో వ్యవస్థాపకుల్లో వీరు కూడా ఒకరు. తెనాలిలో జరిగిన ఆంధ్ర నాటక కళా పరిషత్తు సమావేశానికి వీరు అధ్యక్షత వహించారు.

  1. సురభి సప్తతి స్వర్ణోత్సవ సంచిక (1 ed.). హైదరాబాద్: సురభి నాటక కళాసంఘము. 1960. Retrieved 11 December 2014.
The contents of this page are sourced from Wikipedia article on 13 Jul 2019. The contents are available under the CC BY-SA 4.0 license.