Biography
Lists
Also Viewed
Quick Facts
Intro | Indian author | |||
Places | India | |||
is | Author Scientist | |||
Work field | Literature Science | |||
Gender |
| |||
Birth | 1946 | |||
Age | 79 years | |||
Education |
| |||
Employers |
|
Biography
డా. చందు సుబ్బారావు మార్క్సిస్టు రచయిత, అభ్యుదయ రచయితల సంఘంలో ప్రముఖుడు. ఇతను భూభౌతిక శాస్త్రవేత్త, ఆంధ్ర విశ్వవిద్యాలయం లో ప్రొఫెసరు. చలం స్త్రీవాద భావాలను బలంగా నమ్మే వ్యక్తి. స్త్రీవాద వ్యాసాలతో పాటు రాజకీయ వ్యాసాలు కూడా వ్రాస్తూంటాడు. విశ్వ విద్యాలయాలలో జ్యోతిషం కోర్సులు ప్రవేశ పెట్టాలన్న ప్రతిపాదనను ఇతను తీవ్రంగా వ్యతిరేకించాడు.
జీవిత విశేషాలు
ఆయన 1946 మే 18 న ఆంధ్రప్రదేశ్ లోని చదలవాడ లో వెంకటకృష్ణయ్య, రాజ్యలక్ష్మి దంపతులకు జన్మించాడు. విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాలలో 1964లో బి.ఎస్సీ చేసాడు. 1967లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ టెక్నాలజీ చేసాడు. 1974లో విశాఖపట్నం లోని ఆంద్రవిశ్వవిద్యాలయం నుండి భూభౌతిక శాస్త్రంలో డాక్టరేటు పొందాడు. రష్యన్ భాషలో జూనియర్ డిప్లొమా పొందాడు.
కెరీర్
ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 1974-85 లలో లెక్చరరు గానూ, 1985-93 వరకు రీడరు గానూ 1993 నుండి హైడ్రాలజీ అండ్ వెల్-లాగింగ్ కు ప్రొఫెసరు గానూ, విశాఖపట్నంలో స్టడీ సర్కిల్ లో అసిస్టెంట్ డైరక్టరు గానూ (1988-91), విశాఖపట్నం లోని సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలకు ఉప ప్రిన్సిపాల్ గానూ చేసాడు.
రచయితగా
ఆయన "సైన్స్ అండ్ సివిలైజేషన్" అనే గ్రంథాన్ని 1997 లో రచించాడు. 1997 లో "కవికి విమర్శకుడు శత్రువు కాదు" అనే గ్రంథం రచించాడు.
పురస్కారాలు
- 1966లో సుబ్బారావు తాపీ ధర్మారావు అవార్డు ను పొందాడు. ఆయన ఆంధ్ర రచయితల సంఘానికి సెక్రటరీగా 1979-82 మధ్య ఉన్నాడు. ఇండియా మెటెయరలాజికల్ సొసైటీ లో సభ్యుడు.
- 1999లో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ నుండి కొండేపూడి సాహితీ సత్కారం అందుకున్నాడు.