Biography
Lists
Also Viewed
Quick Facts
Intro | Indian writer | |
Places | India | |
was | Writer | |
Work field | Literature | |
Gender |
| |
Birth | 1861 | |
Death | 1916 (aged 55 years) |
Biography
అల్లాడి మహాదేవశాస్త్రి 1861- 1916.
మహాదేవశాస్త్రి ఇంగ్లీషు, తెలుగు, సంస్కృత భాషల్లో గొప్ప పండితుడు. వేదాధ్యయనం చేసాడు. జననం నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలోని పుదూరు గ్రామము.
.తండ్రిగారి వద్ద సంస్కృతం, ఆంధ్రం, వేదం చదువుకొన్నారు.
ఈయన హైస్కూల్ చదువు, కర్నూలులో జరిగింది. matriculation కర్నూలులో పూర్తిచేసి, మద్రాసు ప్రెసిడెన్సి కాలేజీలో,1883లొ BA. Degree సాధించారు. ఈరోజుల్లోనే సంస్కృతభాష, సాహిత్యాలను అధ్యయనం చేసారు, కొంతకాలం రాయవెల్లూరులోను, తర్వాత నెల్లూరులో సుంకు నారాయణ సెట్టి నెలకొల్పిన హిందూ స్కూల్ లోను పనిచేసారు.
1891 లో మైసూరు సంస్థానం మైసూరు ఓరిఎంటల్ లైబ్రరీలో Curator గా చేశారు. పుస్తక పరిష్కరణ, ప్రచురణ, వేదాంత గ్రంథాలను ఇంగ్లీషులోకి అనువాదం చేయడంలో తలమునకలుగా పనిచేసారు.
దివ్యజ్ఞాన సమాజంవారి ప్రార్థన మన్నించి శంకర భాష్యాన్ని ఇంగ్లీషులోకి అనువదించడానికి పూనుకొన్నారు.
అయితే ఆ గ్రంథానికి ప్రామాణిక ముద్రిత ప్రతి లేకపోవడం చేత, రాతప్రతులను, అచ్చు ప్రతులను సేకరించి ఒక ప్రామాణిక ప్రతిని ముందు తయారు చేశారు.
ఈయన చేసిన అనువాదం "THE BHAGAVAD GITA with the commentary of Sri SANKARACHARYA" పేరుతొ 1897 లో ప్రచురింప బడింది.ఇటీవల వివిధ ప్రచురణ సంస్థలు ఈ గ్రంథాన్ని మళ్లి ప్రచురిచాయి.
మహాదేవశాస్త్రి అనువాదాన్ని స్వామి వివేకానంద మెచ్చుకొంటూ వుత్తరం రాసారు. తైత్తరీయ ఉపనిషద్ మీద, భగవద్గీత వ్యాఖ్యానం, ది వేదిక్ లా అఫ్ మ్యారేజ్, మరికొన్ని ప్రామాణిక గ్రంథాలు ఆయన రచించా శాస్త్రిగారు తర్వాత అనేక ఉపనిషత్తులను ఇంగ్లీషులోకి అనువదించారు. ఆ గ్రంథాలను మైసూరు Oriental లైబ్రరీ ప్రచురించింది.
ఈయన ఇంగ్లీషు అనువాదం "దక్షిణామూర్తి స్తోత్రం" కూడా ప్రచురణ ప్రచురించబడినట్లు తెలుస్తోంది. English Wikipadia లో ఈయనను గురించి చాల వివరాలు, ఫోటోలు ఉన్నవి.
మూలాలు:విక్రమసింహపురి మండల సర్వస్వ, సంపాదకులు: ఎన్.ఎస్.కృష్ణమూర్తి, నెల్లూరు జిల్లా పరిషద్ ప్రచురణ, 1964.
ఈయన భారత్ సమాజ్ కోసం రెండు చిన్న పుస్తకాలు రాసారు.1903 Tyttareeyopanishad ఇంగ్లీష్ అనువాదం ప్రచురించారు.
1903 ప్రాంతంలో Theosophical Society, Adayar వారి కోరికను అంగీకరించి అక్కడ గ్రంథాలయంలో డైరెక్టర్ అఫ్ ఒరిఎంటల్ సెక్షన్ పదవిలో పనిచేసి,1916 లో పదవీ విరమణ చేసారు. ఆ తర్వాత కొన్ని మాసాలకే ఆయన చనిపోయాడు. ఆయన సమగ్ర రచనలు, కృషి తెలియవలసి ఉంది.
మూలాలు
- 1. విక్రమసింహపురి మండల సర్వస్వం, నెల్లూరు జిల్లా పరిషద్ ప్రచురణ,1964. సంపాదకులు: యెన్.ఎస్.కృష్ణమూర్తి.
- 2. https://theprint.in/forgotten-founders/alladi-krishnaswami-ayyar-the-man-ambedkar-said-was-better-than-him/107033/స్టార్ అఫ్ మైసూర్ ఇంగ్లీష్ పత్రిక 2023 April 17th సంచికలో శ్రీమతి గిరిజమహదేవన్ అల్లాడి మహాదేవశాస్త్రిపై రాసిన సచిత్ర వ్యాసం.
- 3. The Indian Biographical Dictionary (1915)/Mahadeva Aiyer (Sastry) Alladi
https://theprint.in/forgotten-founders/alladi-krishnaswami-ayyar-the-man-ambedkar-said-was-better-than-him/107033/ https://www.indiatimes.com/explainers/news/constitution-architects-alladi-krishna-ayyars-contribution-to-the-constitution-590296.html