Biography
Lists
Also Viewed
The basics
Quick Facts
Places | India | |
Gender |
|
The details
Biography
భూసురపల్లి వెంకటేశ్వర్లు ప్రముఖ వాగ్గేయకారులు. ప్రకాశం జిల్లాలో పుట్టి పెరిగి, సాహిత్యరంగంలో పరిశోధనలు చేసి, ప్రస్తుతం గుంటూరు జిల్లా చేబ్రోలులో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు భాషోపన్యాసకులుగా పనిచేస్తున్నారు. వీరు స్వతహాగా డోలు విద్వాంసులు.
జీవిత విశేషాలు
భూసురపల్లి వెంకటేశ్వర్లు ఆదిశేషయ్య, సుబ్బరత్నమ్మ దంపతులకు 1955 సెప్టెంబర్, 4వ తేదిన ప్రకాశంజిల్లా మద్దిపాడులో జన్మించారు.
విద్య
- మద్దిపాడు లో పాఠశాల విద్య, ఒంగోలు కళాశాల విద్య పూర్తిచేసుకొని ఆంధ్ర విశ్వవిద్యాలయం లో ఎం.ఎ. (తెలుగు) చదివారు. తెలుగు విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందారు.
గురువులు
- సాహిత్యరంగంలో డా.నాగభైరవ కోటేశ్వరరావు, సంగీతరంగంలో పద్మశ్రీ డా. హరిద్వారమంగళం, ఎ.కె.పళనివేల్
బిరుదులు
- సరస్వతీపుత్ర
- వాక్చతురానన
- వినయభూషణ
రచనలు
- తెలుగు సాహిత్య రూపకాలు( పిహెచ్.డి.కోసం చేసిన పరిశోధన).
- ఆంధ్రప్రదేశ్ నాదస్వర డోలు కళాకారుల చరిత్ర-1986
- దేవులపల్లి కృష్ణశాస్త్రి
- ఒక అనుభవం నుంచి -2003
- నేతాజి (నవల)(ఒరిస్సాలో ఉపవాచకంగా 1986లో ఉంది).
- త్యాగరాజు(చారిత్రక నవల)
అవార్డులు
ఆయనకు 2013 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం వారు 'వివిధ ప్రక్రియలు'విభాగంలో "కీర్తి పురస్కారాన్ని" ప్రకటించారు.