Abhinaya Srinivas

Telugu lyricist
The basics

Quick Facts

IntroTelugu lyricist
isLyricist
Birth1976
Age49 years
The details

Biography

అభినయ శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉద్యమ, సినీ గీత రచయిత, గాయకుడు, రంగస్థల నటుడు, దర్శకుడు. గోరింటాకు సినిమాలోని అన్నాచెల్లెలి అనుబంధం జన్మజన్మల సంబంధం, తెలంగాణ ఉద్యమం కోసం ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా వంటి పాటలను రచించాడు. 2022, జనవరి 5న "స్వచ్ఛ సర్వేక్షణ్ - 2022 మోత్కూర్ పట్టణ బ్రాండ్ అంబాసిడర్" గా నియమించబడ్డాడు.

జననం

అభినయ శ్రీనివాస్ అసలు పేరు దొంతోజు శ్రీనివాసచారి. అభినయ కలం పేరు. ఇతడు 1977, జనవరి 23న బ్రహ్మచారి, నర్సమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం లోని యాదాద్రి - భువనగిరి జిల్లా, మోత్కూరులో జన్మించాడు.

విద్యాభ్యాసం

1992లో పదవ తరగతిలో మోత్కూరు పాత తాలూకా పరిధిలో మొదటిస్థానంలో నిలిచి, నల్లగొండలోని ప్రభుత్వ పాలిటెక్నికల్‌ కళాశాలలో మెకానికల్‌ ఇంజనీరింగ్, తిరుమలగిరిలోని ప్రగతి డిగ్రీ కళాశాలలో డిగ్రీ, హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు సాహిత్యం పూర్తి చేశాడు.

వివాహం - పిల్లలు

ఈయనకు శ్రీలతతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు (వంశీచరణ్, ప్రణవనాథ్).

కళారంగ ప్రవేశం

1989లో మిత్రులతో కలిసి మోత్కూర్ లో అభినయ కళాసమితిని స్థాపించాడు. రాష్ట్ర, జిల్లా స్థాయి నాటకపోటీల్లో పాల్గొని వందల నాటక ప్రదర్శనలు ఇచ్చి బహుమతులు అందుకున్నాడు.

రచనలు

సినిమా పాటలు

2005లో వచ్చిన నిరీక్షణ సినిమాలోని ధేఖో ధేఖో భాయ్ అనే పాట ద్వారా సినీరంగ ప్రవేశం చేసి గోరింటాకు, నవ వసంతం, దొంగల బండి, సవాల్, భీమిలి కబడ్డీ జట్టు, మంచివాడు, వెంకటాద్రి, అధినేత, సమర్ధుడు, సేవకుడు, జై తెలంగాణ, వీడు మాములోడు కాదు, నచ్చావ్ అల్లుడు, ఎస్.ఎం.ఎస్., వీర, పోరు తెలంగాణ, జలక్, మా వూరి మహర్షి, మిస్టర్ లవంగం, పున్నమి నాగు, విజయదశమి, ఫస్ట్ లవ్, వాడే కావాలి కాకతీయుడు, వైభవం వంటి 50కు పైగా సినిమాలలో అనేక పాటలు రాశాడు. గోరింటాకు సినిమాలోని అన్నాచెల్లెలి అనుబంధం జన్మజన్మల సంబంధం పాట మంచి గుర్తింపునిచ్చింది.

తెలంగాణ పాటలు

శరణాంజలి, తెలంగాణ సంగతులు, ఆఖరి మోఖ, ఔర్ ఏక్ ధక్కా వంటి తెలంగాణ పాటల సీడిలు రూపొందించాడు. తెలంగాణ ఉద్యమం కోసం రాసిన ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా పాట మంచి గుర్తింపునిచ్చింది.

టెలివిజిన్ రంగం

  • 2006లో మాటీవిలో ప్రసారమైన క్రాంతి సీరియల్, ఘర్షణ రియాలిటీ షోలకు టైటిల్ సాంగ్ లు రాశాడు.
  • దూరదర్శన్ లో అనేక లలిత గీతాలు రాసి, ఆలపించారు. తొవ్వ ధారావాహికకు టైటిల్ సాంగ్ రాశాడు.
  • 2016లో సాక్షి బతుకమ్మ పాటలు... జీతెలుగులో మనసున మనసై మెగా సీరియల్ కు పాటలు రాశాడు.

నాటికలు

జాగృతి, నవతరం, సంధిగ్ధ సంధ్య, కాలగర్భం, చరమగీతం. కాలగర్భం నాటికలో 'పాలకుర్తి పోతురాజు', సందిగ్ధ సంధ్య నాటికలో 'భూపతి' పాత్రలకు రాష్ట్రస్థాయిలో ఉత్తమ విలన్ గా గుర్తింపు.

ఇతర రచనలు

  • యాదాద్రి-భువనగిరి జిల్లా ప్రాశస్త్య గీతం

అవార్డులు

  1. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు, 2017, జూన్ 2 కెసీఆర్ చేతులమీదుగా పురస్కారం అందుకున్నాడు.
  2. తేజా సాహిత్యం పురస్కారం (2016)
  3. తెలంగాణ విశ్వవిద్యాలయం, నిజామాబాద్ పురస్కారం
  4. యు.ఐ.ఎస్.ఈ.ఎఫ్. వారి ప్రోత్సాహిక రచయిత పురస్కారం (2008)

గుర్తింపులు

  • 1998లో అభినయ శ్రీనివాస్ రచించిన ప్రజల వద్దకు ప్రభుత్వ వైద్యం పాటల సిడీని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులమీదగా ఆవిష్కరణ.
  • 2014లో ఏర్పడిన తెలంగాణ సాంస్కృతిక సారథిలో రచయితగా బాధ్యతలు స్వీకరించి, ప్రభుత్వ పథకాలపై పాటలు రాయడం జరిగింది.
  • హరితహారం కోసం అభినయ శ్రీనివాస్ రచించిన (మొక్కలు నాటే యజ్ఞం మొదలైయ్యింది... హరితతెలంగాణ నేల పులకరించింది, వానలు వాపస్ రావాలే) పాటలను విన్న ముఖ్యమంత్రి కెసిఆర్‌ శ్రీనివాస్ ను పిలిచి అభినందించారు.
  • స్వచ్ఛ సర్వేక్షన్ - 2022 మోత్కూర్ పట్టణ బ్రాండ్ అంబాసిడర్ (2022, జనవరి 5)

మూలాలు

ఇతర లంకెలు

The contents of this page are sourced from Wikipedia article on 05 May 2024. The contents are available under the CC BY-SA 4.0 license.